priyanka gandhi: ప్రియాంకా గాంధీ అనవసరంగా సమయం వృథా చేస్తున్నారు: కేజ్రీవాల్ విమర్శలు

  • రాజస్థాన్, మధ్యప్రదేశ్ లలో ఎందుకు ప్రచారం నిర్వహించడం లేదు
  • బీజేపీతో నేరుగా పోటీ ఉన్న ప్రాంతాలకు వెళ్లడం లేదు
  • ఎస్పీ, బీఎస్పీలకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తున్నారా?
ఎన్నికలలో ప్రచారం చేస్తూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ అనవసరంగా సమయాన్ని వృథా చేస్తున్నారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. బీజేపీతో నేరుగా పోటీ ఉన్న ప్రాంతాల్లో ఆమె ప్రచారం నిర్వహించడం లేదని అన్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ లలో ఆమె ప్రచారం ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. ఎస్పీ, బీఎస్పీలకు వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్ లో మాత్రమే ప్రచారం నిర్వహిస్తున్నారా? అని అడిగారు. బీజేపీతో నేరుగా పోటీ ఉన్న ప్రాంతాల్లోకి రాహుల్, ప్రియాంకలు వెళ్లడం లేదని అన్నారు.

రాంలీలా మైదానంలో ర్యాలీని నిర్వహించనున్న ప్రధాని మోదీని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నానని కేజ్రీవాల్ చెప్పారు. ఢిల్లీకి పూర్తి స్థాయిలో రాష్ట్ర హోదాను కల్పిస్తామని చెప్పి, ఎందుకు వెనకడుగు వేశారు? పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో మీకున్న సంబంధం ఏమిటి? మోదీ మరోసారి ప్రధాని కావాలని ఇమ్రాన్ ఎందుకు అన్నారు? అని ప్రశ్నించారు.
priyanka gandhi
kejriwal
modi
Rahul Gandhi

More Telugu News