Andhra Pradesh: ఐటీ దాడులపై స్పందించిన నిర్మాత దిల్ రాజు!

  • రేపు విడుదల కానున్న మహర్షి
  • ఒక్కరోజు ముందు ఐటీ దాడులు
  • ఆఫీసు, ఇంటిలో రికార్డుల పరిశీలన
‘మహర్షి’ సినిమా సహనిర్మాత దిల్ రాజు ఇంటిపై ఈరోజు ఐటీ అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. దిల్ రాజు ఇంటితో పాటు ఆయన ఆఫీసులోనూ సోదాలు నిర్వహించారు. మహర్షి సినిమా బిజినెస్ భారీ స్థాయలో జరిగినట్లు సమాచారం రావడంతో అధికారులు ఈ దాడులు నిర్వహించినట్లు సమాచారం. కాగా, ఈ ఐటీ దాడులను దిల్ రాజు లైట్ తీసుకున్నారు.

ఐటీ అధికారులు సోదాలు నిర్వహించడంపై ఆయన స్పందిస్తూ..‘ఐటీ దాడులు జరగడం అన్నది కామన్. పెద్ద సినిమాల రిలీజ్ సమయంలో ఇలాంటి సోదాలు జరుగుతూనే ఉంటాయి. దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని స్పష్టం చేశారు. మహేశ్ బాబు, పూజాహెగ్డే జంటగా, ప్రకాశ్ రాజ్, ప్రధాన పాత్రలో అల్లరి నరేశ్ నటించిన ఈ సినిమాను వంశీ పైడిపల్లి రూపొందించగా, దిల్ రాజు, పీవీపీ, అశ్వనీదత్ నిర్మించారు. ఈ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Andhra Pradesh
Telangana
Tollywood
mahesh babu
dil raju

More Telugu News