చంద్రబాబు మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయారు.. సుప్రీం కర్రు కాల్చి వాత పెట్టింది!: విజయసాయిరెడ్డి
- 50 శాతం వీవీప్యాట్ల లెక్కింపు కుదరదని సుప్రీం చెప్పింది
- కోర్టు తీర్పును తప్పుపట్టేలా బాబు మాట్లాడారు
- ట్విట్టర్ లో స్పందించిన వైసీపీ నేత
ఈరోజు ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ..‘చంద్రబాబు మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయాడు. అన్ని వీవీప్యాట్లను లెక్కించడం సాధ్యం కాదని కిందటి సారే సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. కానీ చంద్రబాబు కోర్టు తీర్పును తప్పు పట్టేలా మాట్లాడాడు. మళ్లీ సుప్రీంలో రివ్యూకు వెళితే కర్రు కాల్చి వాత పెట్టింది. 40 ఏళ్లలో స్వార్థం తప్ప హుందాతనాన్ని అలవర్చుకోలేదు’ అని విమర్శల వర్షం కురిపించారు.