రాజస్థాన్ లో దారుణం.. భర్త కళ్లముందే భార్యపై గ్యాంగ్ రేప్.. వీడియో తీసి వార్నింగ్!
- ఆళ్వార్ ప్రాంతంలో ఏప్రిల్ 26న ఘటన
- పోలీసులను ఆశ్రయించిన బాధిత కుటుంబం
- రెండు బైక్ లపై జంటను అడ్డగించి దాడి
ఆళ్వార్ లోని లాల్ వాడీ గ్రామం నుంచి త్రల్విక్షా గ్రామానికి ఓ జంట బైక్ పై బయలుదేరింది. అయితే వీరిని రెండు మోటార్ సైకిళ్లలో కొందరు దుండగులు వెంబడించారు. నిర్మానుష్య ప్రాంతానికి చేరుకోగానే వీరి బైక్ ను అడ్డగించారు. అనంతరం భర్తపై విచక్షణారహితంగా దాడిచేశారు. ఓవైపు భర్తపై ఇద్దరు దుండగులు దాడిచేస్తుండగా, మరో ముగ్గురు వివాహితపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు.
అనంతరం మిగిలిన ఇద్దరు కూడా ఆమెపై అత్యాచారం చేశారు. ఈ అఘాయిత్యాన్ని వీడియోలో చిత్రీకరించిన దుండగులు, విషయం బయటకు చెబితే చంపేస్తామనీ, వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఘటనాస్థలం నుంచి పరారయ్యారు.
దీంతో బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఎస్సీ,ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టంతో పాటు ఐపీసీలోని పలు పెక్షన్ల కింద గుర్తుతెలియని నిందితులపై కేసు నమోదుచేశారు. వీరిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు.