అదంతా పుకారే .. అందులో ఎంతమాత్రం నిజం లేదు: నటుడు రాజారవీంద్ర
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అదంతా పుకారే .. అందులో ఎంతమాత్రం నిజం లేదు: నటుడు రాజారవీంద్ర

  • 'సర్పవరం' మంచి పేరు తెచ్చింది 
  • వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాను 
  • నా కేరెక్టర్ విషయంలో ఎప్పుడూ  షరతులు పెట్టలేదు
నటుడిగా రాజా రవీంద్రకి మంచి గుర్తింపు వుంది. ఇటు బుల్లితెర ధారావాహికల్లోను .. అటు వెండితెరపైనా ఆయన విభిన్నమైన పాత్రలను చేస్తూ వచ్చారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తనకి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.

" నా తొలి చిత్రం 'మృగతృష్ణ' .. ఆ తరువాత చేసిన 'సర్పయాగం' సినిమాతో నాకు మంచి పేరు వచ్చింది. ఆ తరువాత అలా సినిమాలు చేస్తూ వస్తున్నాను. చాలామంది హీరోలకి నేను మేనేజర్ గా వ్యవహరిస్తున్నాను .. వాళ్ల డేట్స్ నేనే చూస్తుంటాను. అయితే, వాళ్ల డేట్స్ కావాలంటే నాకు కూడా ఒక కేరక్టర్ ఇవ్వాలనే షరతు పెడుతున్నాననడంలో నిజం లేదు .. అదంతా కేవలం పుకారు మాత్రమే. 'మీరే ఈ పాత్ర చేయాలి' అని ఎవరైనా వస్తేనే చేస్తాను. ఆ పాత్రకి నేను సెట్ కాకపోతే ఒప్పుకోను కూడా. అలా వదిలేసిన పాత్రలు .. వేరే వారిని తీసుకోమని చెప్పిన సందర్భాలు చాలానే వున్నాయి" అని చెప్పుకొచ్చారు. 
raja ravindra

More Telugu News