వీరాభిమానం: కుమారుడి పెళ్లి పత్రికపై బాలకృష్ణ ఫొటోను ముద్రించుకున్న కర్ణాటక అభిమాని
- తన కుమారుడి పెళ్లి శుభలేఖపై బాలయ్య ఫొటోలు
- బాలయ్య అభిమానులందరూ పెళ్లికి రావాలని పిలుపు
- నూతన దంపతులకు బాలయ్య ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయన్న అభిమాని
ఈ నెల 13న జరగనున్న తన కుమారుడి పెళ్లికి బాలయ్య, నందమూరి అభిమానులు హాజరై ఆశీర్వదించాలని కోరాడు. వివిధ గెటప్లలో ఉన్న బాలకృష్ణ ఫొటోలను శుభలేఖపై ముద్రించాడు. అంతేకాదు, నూతన దంపతులకు బాలయ్యబాబు ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయని ఫొటోల కింద రాసుకొచ్చాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పెళ్లి శుభలేఖను చూసిన బాలయ్య అభిమానులు పొంగిపోతున్నారు.