దగ్గుబాటి వెంకటేశ్వరరావు తోక పట్టుకుని గోదావరి ఈదే రకం దాసరి బ్రదర్స్: వల్లభనేని వంశీ
- తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకం దాసరి బ్రదర్స్
- వీళ్లు ఎక్కడా స్థిరంగా ఉండే వాళ్లు కాదు
- ఎన్నికల రిజల్ట్స్ వచ్చాక వీళ్లెవరూ ఊళ్లల్లో కనబడరు
టీడీపీని వీడతారన్న ప్రచారంపై వల్లభనేని వంశీ స్పందిస్తూ, పార్టీని వీడాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. ఎప్పటికీ తాను టీడీపీలోనే ఉంటానని ఘంటాపథంగా చెప్పారు. ఈ ఎన్నికల్లో వైసీపీ గెలిచే ప్రస్తక్తే లేదని అభిప్రాయపడ్డారు. గుడివాడలో టీడీపీ గెలుస్తుందని, అలాగే, దేవినేని ఉమ మళ్లీ మంత్రి అవుతారన్న విశ్వాసం వ్యక్తం చేశారు.