ఫస్ట్ హాఫ్ ఫ్లాప్, సెకండాఫ్ హిట్: విరాట్ కోహ్లీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫస్ట్ హాఫ్ ఫ్లాప్, సెకండాఫ్ హిట్: విరాట్ కోహ్లీ

  • చివరి 7 మ్యాచ్ లలో 5 గెలిచిన కోహ్లీ
  • ఓ మ్యాచ్ రద్దు కావడంతో ప్లే ఆఫ్ కు దూరం
  • విజయంతో సీజన్ ను ముగించామన్న కోహ్లీ
ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో తొలి సగభాగం తాము పూర్తిగా విఫలం అయ్యామని, రెండో అర్ధభాగంలో తమ జట్టు సూపర్ హిట్ అయిందని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. శనివారం నాడు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును ఓడించిన తరువాత కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. చివరి 7 మ్యాచ్ లలో 5 విజయాలను నమోదు చేశామని గుర్తు చేసిన కోహ్లీ, తొలి 7 మ్యాచ్ లలోనూ ఇదే తరహా ఫలితాలను నమోదు చేసుంటే పరిస్థితి మరోలా ఉండేదని అన్నాడు.

ఏది ఏమైనా ఈ సీజన్ లో తాము ఆర్సీబీ అభిమానులను అలరించలేకపోయామని, ఇదే సమయంలో ఓ మంచి విజయంతో సీజన్ కు ముగింపు పలికామని అన్నాడు. వరుసగా ఆరు మ్యాచ్ లలో ఓడిపోయిన తరువాత కోలుకోవడం చాలా కష్టమని, కానీ, తాము ప్లే ఆఫ్ కు దగ్గరగా వచ్చామని అన్నాడు. ఓటములు ఎదురవుతున్నా, తమ జట్టు యాజమాన్యం వెన్నంటి నిలిచిందని చెప్పుకొచ్చాడు. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడం తమను ప్లే ఆఫ్ కు దూరం చేసిందని కోహ్లీ అభిప్రాయపడ్డాడు.
Virat Kohli
IPL
Cricket

More Telugu News