‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ప్రదర్శన అడ్డుకోవడంలో విఫలమైన కడప జేసీపై చర్యలకు సిఫారసు చేశాం: ద్వివేది

  • కడపలోని రెండు థియేటర్లలో ఈ చిత్ర ప్రదర్శన జరిగింది
  • కడప జేసీపై చర్యలకు సీఈసీకి సిఫారసు చేశాం
  • ఏపీలో రీపోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి
ఎన్నికల నియమావళి నుంచి రాష్ట్రంలోని నాలుగు జిల్లాలకు మినహాయింపు ఇచ్చినట్టు ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి ద్వివేది పేర్కొన్నారు. తుపాన్ సహాయక చర్యల నిమిత్తం తూర్పు గోదావరి, విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు ఈ మినహాయింపు లభించినట్టు చెప్పారు. ఎన్నికల కోడ్ మినహాయింపు అనేది ఎన్నికల ఫలితాలు వెలువడే వరకూ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఏపీలో రీపోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయని, వర్షాలకు స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నట్టు చెప్పారు.

 ఈ సందర్భంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ గురించి ఆయన ప్రస్తావించారు. ఈ చిత్ర ప్రదర్శన అడ్డుకోవడంలో కడప జిల్లా జాయింట్ కలెక్టర్ (జేసీ) విఫలమయ్యారని, ఈ నేపథ్యంలో ఆయనపై చర్యలకు సీఈసీకి సిఫారసు చేసినట్టు చెప్పారు. కడపలో రెండు థియేటర్లలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ప్రదర్శన జరిగిందని అన్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
dwivedi
East Godavari District
vizag
vijayanagaram
Srikakulam District

More Telugu News