అందరూ స్టార్ హీరోయిన్స్ .. అయినా ఒక కుటుంబంలా ఉండేవారు: సీనియర్ నటి గీతాంజలి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అందరూ స్టార్ హీరోయిన్స్ .. అయినా ఒక కుటుంబంలా ఉండేవారు: సీనియర్ నటి గీతాంజలి

  • అందరి మధ్య ఆప్యాయత వుండేది
  •  నన్ను ప్రేమగా చూసుకునేవారు
  •  ఆ రోజులన్నీ తీపిగుర్తులు
తెలుగు తెరపై సందడి చేసిన నిన్నటి తరం తారల్లో గీతాంజలి ఒకరు. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ అనేక ఆసక్తికరమైన విషయాలను గురించి ప్రస్తావించారు. సావిత్రి .. అంజలీదేవి .. భానుమతి .. 'షావుకారు' జానకి .. కృష్ణకుమారి .. జమున .. బి.సరోజాదేవి .. వీళ్లంతా అప్పటి స్టార్ హీరోయిన్స్. అయినా అంతా ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. ఒకరినొకరు 'అక్కా' అనీ .. 'చెల్లీ' అని పిలుచుకుంటూ ఉండేవారు.

వాళ్లంతా నన్ను 'గీతా .. గీతా' అని పిలుస్తూ ఎంతో ప్రేమగా చూసుకునేవారు. ఆ రోజుల్లో మేమంతా ఒక కుటుంబమనే భావనతో ఆనందాన్ని పొందాము. ఈ రోజుల్లో సొంతవాళ్లలోనే నేను అలాంటి ప్రేమానురాగాలను చూడలేదు. సెట్లో మేము కలిస్తే సందడే సందడి .. కలిసి నటించే అవకాశం వస్తే అదృష్టం అనుకునే వాళ్లం. ఇప్పటికీ మా మధ్య అవే ప్రేమానురాగాలు వున్నాయి. ఆ రోజులన్నీ తీపిగుర్తులుగా నడిపిస్తున్నాయి" అని చెప్పుకొచ్చారు. 
geetanjali

More Telugu News