షావుకారు జానకి నటనను కాపీ కొట్టేశానంతే: సీనియర్ నటి గీతాంజలి
- చలం హీరోగా చేసిన సినిమా 'సంబరాల రాంబాబు'
- తమిళంలో ఆ పాత్రను 'షావుకారు' జానకి చేశారు
- తెలుగులో ఆ పాత్రను నేను చేశాను
తమిళంలో 'షావుకారు' జానకి గారు చేసిన పాత్రను, తెలుగులో నేను చేశాను. బ్రాహ్మణీకం ఉట్టిపడే పాత్రలో 'షావుకారు' జానకి గారు అద్భుతంగా చేశారు. ఆమె నడక .. మాట తీరు .. హావభావాలను గమనించి నేను తెలుగులో ఆ పాత్రను చేశాను. నటిగా నా కెరియర్లో నేను కాపీ కొట్టి చేసిన పాత్ర అదే. ఈ పాత్రను చాలా బాగా చేయాలని చలం పదే పదే చెబుతూ ఉండేవారు. ఆయనకి సంతృప్తిని కలిగించే విధంగా నేను చేయగలిగినందుకు సంతోషం కలిగింది" అని చెప్పుకొచ్చారు.