varun tej: 'వాల్మీకి'లో వరుణ్ తేజ్ లుక్ ఇదే!

  • వరుణ్ తేజ్ హీరోగా 'వాల్మీకి'
  • తమిళంలో వచ్చిన 'జిగర్తాండ'కి రీమేక్ 
  • కథానాయికగా మృణాళిని     
తెలుగులో విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ వరుణ్ తేజ్ దూసుకుపోతున్నాడు. తాజాగా ఆయన హరీశ్ శంకర్ దర్శకత్వంలో 'వాల్మీకి' సినిమా చేస్తున్నాడు. కొంతకాలం క్రితం తమిళంలో భారీ విజయాన్ని నమోదు చేసిన 'జిగర్తాండ'కి ఇది రీమేక్. తమిళంలో బాబీసింహా చేసిన పాత్రను తెలుగులో వరుణ్ తేజ్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన లుక్ కి సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గుబురుగా పెరిగిన గెడ్డం .. మీసాలతో, కొత్తరకం హెయిర్ స్టైల్ తో వరుణ్ తేజ్ కనిపిస్తున్నాడు. నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో తెరపై ఆయన ఈ లుక్ తో కనిపించనున్నాడన్న మాట. ఇక తమిళంలో సిద్ధార్థ్ చేసిన పాత్రను అధర్వ చేస్తున్నాడు. తమిళ బ్యూటీ మృణాళిని ఈ సినిమాలో కథానాయికగా కనిపించనుంది. ఈ సినిమాతో తనకి తప్పకుండా హిట్ పడుతుందనే నమ్మకంతో వరుణ్ తేజ్ వున్నాడు. ఇక హరీశ్ శంకర్ కి ఈ సినిమా విజయం మరింత అవసరమనే చెప్పాలి. 
varun tej
mrunalini

More Telugu News