ఏపీ మంత్రి సోమిరెడ్డికి మళ్లీ షాక్.. ఈరోజు ముఖం చాటేసిన ఉద్యానవన శాఖ అధికారులు!
- మంత్రి సమీక్షా సమావేశానికి డుమ్మా
- ఈసీ కోడ్ నేపథ్యంలో జాగ్రత్తలు
- ఎవ్వరూ రాకపోవడంతో వెనుదిరిగిన సోమిరెడ్డి
ఇందులో భాగంగా సమావేశానికి హాజరు కావాలని అధికారులను ఆదేశించారు. అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో సమీక్షా సమావేశానికి వెళితే ఏం ఇబ్బంది వస్తుందో అని భావించిన అధికారులు మౌనంగా ఉండిపోయారు. దీంతో ఈరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ అధికారుల కోసం ఎదురుచూసిన సోమిరెడ్డి, చివరికి చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్లిపోయారు.