నంద్యాల ఎంపీ, జనసేన నేత ఎస్పీవై రెడ్డి కన్నుమూత
- ఎన్నికల ప్రచారంలో వడదెబ్బకు గురైన ఎస్పీవై
- 26 రోజులుగా బంజారాహిల్స్ కేర్‌లో చికిత్స
- మూడుసార్లు ఎంపీగా గెలిచిన ఎస్పీవై రెడ్డి
గత నెలలో జనసేన చీఫ్ పవన్‌తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎస్పీవై రెడ్డి వడదెబ్బకు గురయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను ఏప్రిల్ 3న బంజారాహిల్స్ లోని కేర్ ఆసుపత్రిలో చేర్చారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో మంగళవారం రాత్రి పదిగంటల సమయంలో మృతి చెందారు.