సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తివేసిన శ్రీలంక
- ఉగ్రదాడి తర్వాత సోషల్ మీడియాపై నిషేధం విధించిన శ్రీలంక
- సోషల్ మీడియాను జాగ్రత్తగా వాడాలని సూచన
- శ్రీలంకలో ఇంకా సాధారణ స్థాయికి రాని పరిస్థితులు
సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని నిషేధాన్ని ఎత్తివేసిన సందర్భంగా ప్రజలను ప్రభుత్వం కోరింది. దేశంలో పరిస్థితి ఇంకా సాధారణ స్థాయికి రాలేదని, అందువల్ల సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని సూచించింది. ఉగ్రవాదులు జరిపిన వరుస పేలుళ్లు, ఆత్మాహుతి దాడుల్లో 250 మంది చనిపోయారు. దాదాపు 500 మంది క్షతగాత్రులయ్యారు. చనిపోయిన వారిలో పలువురు భారతీయులు కూడా ఉన్న సంగతి తెలిసిందే.