కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వరరెడ్డికి ఊరట.. బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
- పోలీసులను నిర్బంధించిన కేసులో ముందస్తు బెయిల్
- ఆదేశాలు జారీచేసిన తెలంగాణ హైకోర్టు
- గతంలో ఈ పిటిషన్ ను కొట్టేసిన నాంపల్లి కోర్టు
తొలుత కొండా విశ్వేశ్వరరెడ్డి ముందస్తు బెయిల్ కోసం నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్ ను కోర్టు కొట్టివేయడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కొండా అనుచరుడు సందీప్ రూ.10 లక్షలతో పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ వ్యవహారంలో నోటీసులు అందించేందుకు కొండా విశ్వేశ్వరరెడ్డి ఇంటికి వెళ్లగా, ఆయన తన అనుచరులతో తమను నిర్బంధించారని ఎస్సై కృష్ణ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కొండా విశ్వేశ్వరరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.