kcr: ఐటీకి మారుపేరుగా చెప్పుకునే మీకు గ్లోబరినా తెలియదా?: కేటీఆర్ పై జీవన్ రెడ్డి ధ్వజం

  • విద్యార్థుల భవిష్యత్తుపై మీకున్న చిత్తశుద్ధి ఇదేనా?
  • తెర వెనుక జరుగుతున్నవన్నీ మాకు తెలుసు
  • విచారణ జరిగితే అన్ని విషయాలు బయటకు వస్తాయి
తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాల అవకతవకలకు కారణమైన గ్లోబరినా సంస్థతో తనకు ఎటువంటి సంబంధాలు లేవని, అసలు ఆ సంస్థ గురించి తనకు తెలియదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ పై మండిపడ్డారు.

గ్లోబరినా సంస్థ తనకు తెలియదని కేటీఆర్ అనడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. సాఫ్ట్ వేర్ కు మారుపేరుగా చెప్పుకునే కేటీఆర్ కు గ్లోబరినా తెలియదా? అని ప్రశ్నించారు. విద్యార్థుల భవిష్యత్తుపై మీకున్న చిత్తశుద్ధి ఇదేనా? అని నిలదీశారు. మీ బిడ్డలకు ఒక నీతి, పేదల బిడ్డలకు మరో నీతా? అని మండిపడ్డారు. తెర వెనుక జరుగుతున్నవన్నీ తమకు తెలుసని, న్యాయ విచారణ జరిగితే అన్ని విషయాలు వెలుగు చూస్తాయని చెప్పారు.
kcr
Jeevan Reddy
TRS
congress
globrina
inter
results

More Telugu News