Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'వి' సినిమా నుంచి కొత్త పోస్టర్

  • దిల్ రాజు బ్యానర్లో ఇంద్రగంటి
  •  వెరైటీ టైటిల్ గా 'వి'
  • నానీకి ఇది 25వ సినిమా      
దిల్ రాజు నిర్మాతగా .. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో 'వి' అనే సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో నాని .. సుధీర్ బాబు ప్రధానమైన పాత్రలను పోషించనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అలాగే కథానాయికలుగా నివేదా థామస్ .. అదితీరావు హైదరి కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా చెప్పారు. అయితే కొంత సేపటి క్రితం వదిలిన ఈ సినిమా టైటిల్ పోస్టర్ లో నాని పేరు లేదు.

దాంతో కావాలనే గోప్యంగా వుంచుతున్నారా? లేదంటే నానికి బదులుగా ఆ పాత్రను మరెవరైనా చేయనున్నారా? అనే సందేహం తలెత్తింది. అంతా ఈ విషయాన్ని గురించి మాట్లాడుకుంటూ ఉండగా, ఈ సినిమా నుంచి మరో పోస్టర్ ను వదిలారు. ఫస్టుపోస్టర్ ను సెంటర్లో కట్ చేస్తే నాని పేరు 'రివిల్' అయినట్టుగా చూపిస్తూ రెండో పోస్టర్ ను వదిలారు. నానికి ఇది 25వ సినిమా అనే విషయాన్ని కూడా మెన్షన్ చేశారు. 'వి' వెనకున్న కథ ఏమిటనేదే ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేకెత్తించే అంశంగా మారింది. 
nani
sudheer babu

More Telugu News