Telugudesam: ఇన్ని చేస్తే ఒక్కడికైనా గుర్తుందా?.. అంటూ ఆవేదన వెళ్లగక్కిన జేసీ దివాకర్ రెడ్డి!

  • మీడియా చానల్ కు ఇంటర్వ్యూ
  • చంద్రబాబు చేసిన మంచి ఎవరూ గుర్తించలేదని బాధ
  • పసుపు-కుంకుమే ఆదుకున్నదంటూ వ్యాఖ్య
అనంతపురం ఎంపీ, టీడీపీ ముఖ్యనేత జేసీ దివాకర్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. విపక్షాలు గెలిచేందుకు డబ్బులు పంచాయనుకోవచ్చు, అధికారంలో ఉన్నవాళ్లు చేసిన పనులు చెప్పుకోకుండా ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టాల్సివచ్చింది? అని యాంకర్ ప్రశ్నించగా, జేసీ ఆసక్తికరంగా బదులిచ్చారు.

చంద్రబాబు దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో 120 సంక్షేమ పథకాలు తీసుకువచ్చారని తెలిపారు. మనిషికి గతంతో పనిలేదని, అప్పటికప్పుడు తనకు ఏం లాభం వచ్చిందన్న విషయాన్నే ఆలోచిస్తాడని అన్నారు.

"అంతకుముందువన్నీ తిన్నారు, అరిగిపోయింది. ఏ రోజుది ఆ రోజే అరిగిపోయింది. పోలింగ్ కు ముందు రూ.2000 మహా ప్రీతిపాత్రమైనది. కానీ అంతకుముందు చంద్రబాబు నదులు అనుసంధానం చేశారు, పేదలకు పెళ్లిళ్లు చేశారు, సీఎంఆర్ఎఫ్ కింద అడిగినవాళ్లకు లేదనకుండా యాబై వేలు ఇచ్చారు, కొంపలు, గోరీలు అన్నీ ఇచ్చారు. బ్రహ్మాండమైన ఇన్సూరెన్స్ పథకం కూడా తీసుకువచ్చారు.

ఇన్ని చేస్తే ఒక్కడికైనా గుర్తుందా? నాలాంటి వెధవ నా*** ఎవడో ఒక్కడు మెచ్చుకుంటున్నాడు. మిగతా నా కొ**లకు ఎవడికీ పట్టలా! చేసిన మంచిపనులు గుర్తించకపోగా, చేశాడు, అయితే! అంటూ తిరిగి ప్రశ్నిస్తున్నారు"‌ అని ఆవేదన వెళ్లగక్కారు. అయితే, ఎవరు  ఎవర్ని గుర్తించినా గుర్తించకపోయినా పసుపు-కుంకుమ, రైతులకు డబ్బులు అంశాలు మాత్రం టీడీపీకి ఓట్లవర్షం కురిపించాయని జేసీ అన్నారు.
Telugudesam

More Telugu News