Sirivengalacharyulu: బైక్‌ సహా తండ్రీకొడుకులు చెరువులో పడి మృతి

  • మృతులు సిరివెంగళాచార్యులు, వంశీకృష్ణగా గుర్తింపు
  • ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సిరివెంగళాచార్యులు
  • ప్రమాదవశాత్తు జరిగినట్టు భావిస్తున్న పోలీసులు
తండ్రీకొడుకుల అనుమానాస్పద మృతితో ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లిలో ఈ దారుణం చోటు చేసుకుంది. తండ్రీకొడుకులు బైక్‌ సహా చెరువులో పడి మృతి చెందారు. మృతులను సిరివెంగళాచార్యులు(48), వంశీకృష్ణ(14)గా పోలీసులు గుర్తించారు. సిరివెంగళాచార్యులు కొండ్రుప్రోలు గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఘటన ప్రమాదవశాత్తు జరిగినట్టు భావిస్తున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  
Sirivengalacharyulu
Vamsi Krishna
Kondruprolu
Government Teacher
Police

More Telugu News