Andhra Pradesh: ఏపీ రాజకీయాల పట్ల నాకు పెద్దగా ఆసక్తి లేదు.. జగన్ విషయం ఏపీ ప్రజలే చూసుకుంటారు: కేటీఆర్
- ఏపీ సీఎంగా జగన్ సరిపోతాడా? అంటూ ప్రశ్న
- తన అభిప్రాయంతో పని లేదన్న కేటీఆర్
- ఏపీలో పోటీపై ఆసక్తికర సమాధానం
తనకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పట్ల పెద్దగా ఆసక్తి లేదని తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. #AskKtr పేరిట ట్విట్టర్‌లో ఈ రోజు ఆయన అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయనను అభిమానులు రాజకీయాలపై ప్రశ్నలు అడిగారు.
ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ సరిపోతాడా? అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానమిచ్చారు. తన అభిప్రాయంతో పని లేదని, ఆంధ్రా ప్రజలు దానిని నిర్ణయిస్తారన్నారు. తనకు అసలు ఏపీ రాజకీయాల పట్ల పెద్దగా ఆసక్తి లేదని కేటీఆర్ తెలిపారు. 2024 ఎన్నికల్లో ఏపీలో పోటీ గురించి నెటిజన్లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా, 2024 చాలా దూరంలో ఉందని సమాధానమిచ్చారు.