Fani: నెల్లూరు జిల్లాలో ఎగసిపడుతున్న అలలు... ముందుకొచ్చిన సముద్రం

  • స్థానికుల్లో భయాందోళనలు 
  • ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్న అధికారులు
  • పరిస్థితిని సమీక్షిస్తున్న కలెక్టర్
ఫణి తుపాను ప్రభావం నెల్లూరు జిల్లాలో ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. జిల్లాలో అనేక చోట్ల అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. కోవూరు వంటి ప్రదేశాల్లో సముద్రం బాగా ముందుకు రావడంతో స్థానికుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. నెల్లూరు జిల్లా తమిళనాడుకు దగ్గరగా ఉండడంతో ఫణి తుపాను ప్రభావం ఈ జిల్లాపై గణనీయంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఫణి నెల్లూరు జిల్లాకు సమీపంలోనే దిశ మార్చుకోనుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో, పోలీసులు, రెవెన్యూ అధికారులు కలెక్టర్ ఆదేశాల మేరకు ముంద జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో నిమగ్నమయ్యారు. తీర ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
Fani

More Telugu News