అందుకే ఓడిపోతున్నాం... కేకేఆర్ యాజమాన్యంపై డ్యాషింగ్ బ్యాట్స్ మన్ రసెల్ మండిపాటు!
- బ్యాటింగ్ బాగున్నా, బౌలింగ్ లో విఫలం
- ఫీల్డర్లు క్యాచ్ లను పట్టడం లేదు
- ఈ సీజన్ లో చెత్త ఫీల్డింగ్ కేకేఆర్ దేనన్న రసెల్
తమ వద్ద నాణ్యమైన బౌలర్లు ఉన్నారని, వారిని సక్రమంగా వినియోగించుకుంటే ఎటువంటి జట్టునైనా 170 పరుగులకు పరిమితం చేయగలమని అన్నాడు. తమ జట్టేమీ బ్యాటింగ్ లో విఫలం కావడం లేదని, బౌలర్లు మాత్రం దారుణంగా విఫలమవుతున్నారని ఆరోపించాడు. ఫీల్డర్లు క్యాచ్ లను సరిగ్గా పట్టుకోవడం లేదని, ఈ సీజన్ లో అత్యంత చెత్త ఫీల్డింగ్ టీమ్ తమదేనని అన్నాడు. తనను లోయర్ ఆర్డర్ లో పంపడంపైనా ఆండ్రీ రసెల్ మండిపడ్డాడు. ముందుగా పంపాలని తాను కోరినా వినడం లేదని ఆరోపించాడు. ఇక ముంబైతో మ్యాచ్ లో అద్భుతం జరిగితే తప్ప తాము గెలిచే పరిస్థితి లేదని అన్నాడు.