Uttam Kumar Reddy: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ

  • ఫిరాయింపుదార్లు పదవులకు రాజీనామా చేయలేదు
  • విలీనంపై వాళ్లే ప్రకటన చేస్తున్నారు
  • విలీనంపై రాష్ట్ర కాంగ్రెస్ కు హక్కులేదు
తెలంగాణలో తమ పార్టీ ఎమ్మెల్యేలు ఫిరాయింపులకు పాల్పడడమే కాకుండా, వాళ్లే సీఎల్పీ విలీనంపై మాట్లాడుతున్నారంటూ టి-కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఆయన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి లేఖ రాశారు. పార్టీ ఫిరాయింపునకు పాల్పడిన శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చిన పదవులకు రాజీనామా చేయలేదని లేఖలో పేర్కొన్నారు. స్పీకర్ కు ఈ విషయంపై ఎప్పుడో ఫిర్యాదు చేశామని, అయినా స్పందన లేదని ఆరోపించారు.

పార్టీ మారిన ఎమ్మెల్యేలే సీఎల్పీ విలీనంపై  ప్రకటనలు చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభాగానికి సీఎల్పీ విలీనం చేసే హక్కులేదని ఉత్తమ్ కుమార్ స్పష్టం చేశారు. సీఎల్పీ విలీనానికి సంబంధించిన అంశాన్ని కేవియట్ గా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు, సీఎల్పీ విలీనం అనేది స్పీకర్ పరిధిలోని అంశం కాదని, ఈ విషయంలో గతంలో సుప్రీం కోర్టు అనేక తీర్పులు కూడా ఇచ్చిందని ఆయన ప్రస్తావించారు.

More Telugu News

Uttam Kumar Reddy
Congress
Telangana