సమస్య తీవ్రమైనదే.. అయినా పూర్తిగా కోలుకున్నా: దలైలామా
- ఛాతీ ఇన్ఫెక్షన్ తో బాధపడ్డ దలైలామా
- ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స
- ధర్మశాలకు తిరిగిచ్చిన బౌద్ధ మత గురువు
ఏప్రిల్ 7న చికిత్స నిమిత్తం దలైలామాను ఢిల్లీకి తీసుకొచ్చారు. 1989లో దలైలామాకు నోబెల్ శాంతి పురస్కారం లభించింది. చైనాకు వ్యతిరేకంగా పోరాడుతూ 1959లో టిబెట్ నుంచి ఇండియాకు వచ్చిన దలైలామా... అప్పటి నుంచి ఇక్కడే ఆశ్రయం పొందుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో ఆయన ఎక్కువగా గడుపుతారు.