చిరంజీవిగారు మమ్మల్ని ఇంట్లోకి రానిస్తారా అనుకున్నాము: 'గబ్బర్ సింగ్' కమెడియన్ సాయి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చిరంజీవిగారు మమ్మల్ని ఇంట్లోకి రానిస్తారా అనుకున్నాము: 'గబ్బర్ సింగ్' కమెడియన్ సాయి

  • చిరంజీవి మమ్మల్ని లోపలికి పిలిపించారు
  •  అందరితోను ఆప్యాయంగా మాట్లాడారు
  •  మేమంతా ఆశ్చర్యపోయాము  
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా వచ్చిన 'గబ్బర్ సింగ్' లో అంత్యాక్షరి ఎపిసోడ్ ఎంత హైలైట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ ఎపిసోడ్ ద్వారా రౌడీలుగా కనిపించే ఒక కామెడీ గ్యాంగ్ పాప్యులర్ అయింది. ఆ గ్యాంగ్ లో ఒకరైన సాయి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. "చిరంజీవిగారి పుట్టినరోజున ఆయనని మేము కలవాలని అనుకున్నాము. ఆయన మమ్మల్ని ఇంట్లోకి రానిస్తారా లేదా అనే అనుమానంతోనే మేమంతా వెళ్లాము.

కానీ చిరంజీవిగారు మమ్మల్ని లోపలికి పిలిపించి స్వీట్ ఇచ్చారు .. మాతో కలిసి ఫోటో దిగారు. ఆయనతో 2 నిమిషాలు మాట్లాడితే చాలని అనుకున్నాము. కానీ ఆయన చాలా ఆప్యాయంగా మాతో 15 నిమిషాలు మాట్లాడారు. అంత గొప్పవ్యక్తి మాతో అంతసేపు మాట్లాడటం అప్పుడే కాదు ఇప్పటికీ మాకు ఆశ్చర్యం కలిగించే విషయమే" అంటూ చెప్పుకొచ్చాడు.
gabbar singh sai

More Telugu News