పేలుళ్లు తమ పనేనన్న ఐసిస్.. స్థానిక ఉగ్రవాద సంస్థేనంటున్న శ్రీలంక
- ఆరుగురి అనుమానితుల ఫొటోలను విడుదల చేసిన శ్రీలంక
- అనుమానితుల్లో ముగ్గురు మహిళలు
- వారి వివరాలు తెలిస్తే చెప్పాలన్న పోలీసులు
స్థానిక ఉగ్రవాద సంస్థ నేషనల్ థౌహీద్ జమాత్ (ఎన్టీజే)కి చెందిన తొమ్మిదిమంది ఉగ్రవాదులు ఈ వరుస బాంబు పేలుళ్లకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న వారికి ఎన్టీజేతో సంబంధాలున్నట్టు చెబుతున్నారు. కాగా, పేలుడుకు సూత్రధారులుగా భావిస్తున్న ఆరుగురి అనుమానితుల ఫొటోలను శ్రీలంక పోలీసులు విడుదల చేశారు. వారికి సంబంధించిన వివరాలు ఉంటే తెలియజేయాల్సిందిగా ప్రజలను కోరారు. పేలుళ్ల ఘటన వెనక స్థానిక ఎన్టీజే సంస్థ హస్తం ఉందని దర్యాప్తు సంస్థలు భావిస్తుండగా, అది తమపనేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించడం గమనార్హం.