Revanth Reddy: కశ్మీర్‌లో ఎంజాయ్ చేస్తున్న రేవంత్‌రెడ్డి.. సైనికులతో కలిసి ఫొటోలు

  • ఇటీవల ఇంటర్ బోర్డు ఎదుట రేవంత్ రెడ్డి ధర్నా
  • కశ్మీర్‌లో సైనికులతో దిగిన ఫొటోను పోస్టు చేసిన కాంగ్రెస్ నేత
  • మేరా కశ్మీర్, మేరా భారత్ మహాన్ అంటూ కామెంట్
అసెంబ్లీ ఎన్నికల తర్వాత చాలాకాలంపాటు మీడియాకు దూరంగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి లోక్‌సభ ఎన్నికలతో మళ్లీ ప్రజల ముందుకు వచ్చారు. ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్లీ కనిపించకుండా పోయిన ఆయన ఇంటర్ బోర్డు తీరుపై దుమ్మెత్తి పోస్తూ ధర్నాకు దిగారు. పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఇంటర్ బోర్డు, ప్రభుత్వం తీరును ఎండగడుతూ గురువారం కాంగ్రెస్ నిర్వహించిన ఆందోళనల్లో రేవంత్ కనిపించలేదు. దీంతో ఆయన ఎక్కడ ఉన్నారన్న చర్చ మొదలైంది. ఆ చర్చకు తెరదించుతూ తానెక్కడ ఉన్నదీ ఫేస్‌బుక్ ద్వారా రేవంత్ తెలిపారు. కశ్మీర్‌ లోయలో మంచు కొండల మధ్య ఎంజాయ్ చేస్తున్న ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. దానికి ‘మేరా కశ్మీర్, మేరా భారత్ మహాన్’ అని కామెంట్ పెట్టారు.
Revanth Reddy
Congress
Jammu And Kashmir
Telangana

More Telugu News