Arjun kapoor: తప్పుడు వార్తలు సృష్టించడం మంచిది కాదు: అర్జున్ కపూర్

  • మలైకా నాకు ఎంతో ప్రత్యేకం
  • ఏదీ ఎక్కువ రోజులు దాచలేం
  • ఇప్పుడు విసుగెత్తి ఊరుకుంటున్నారు
బాలీవుడ్ నటి మలైకా అరోరాతో ప్రేమ విషయమై అర్జున్ కపూర్ తాజాగా స్పందించాడు. తనకు 33 ఏళ్లేనని, అంత త్వరగా పెళ్లి చేసుకోవాలని లేదని స్పష్టం చేశాడు. తప్పుడు వార్తలు స‌ృష్టించడం మంచిది కాదని హితవు చెబుతూ, ప్రతిసారీ వాటిపై స్పందించలేమని అన్నాడు.

‘మలైకా నాకు ఎంతో ప్రత్యేకం. కానీ మా పెళ్లి ఇప్పుడే జరగదు. నా వయసు 33 మాత్రమే. నాకు ఇంత త్వరగా పెళ్లి చేసుకోవాలని లేదు. అయినా పెళ్లి గురించి మాట్లాడటం నాకు ఇష్టం లేదు. నాకు వివాహమైతే మీకు కూడా తెలుస్తుంది కదా. ఈ కాలంలో ఏదీ ఎక్కువ రోజులు దాచలేం. తప్పుడు వార్తలు సృష్టించడం మంచిది కాదు. కానీ ప్రతిసారీ వీటిపై స్పందించడం నాకు నచ్చదు. ఎక్కువ సేపు వీటికి సమయం కేటాయిస్తే అలసిపోతాం. వదంతులు ఎంతగా ఎక్కువైపోయాయంటే.. ఇదివరకు అవి నమ్మేవారే ఇప్పుడు విసుగెత్తి ఊరుకుంటున్నారు. నాకు ఏదీ దాచాల్సిన అవసరం లేదు. మనకు నచ్చిన వారు చుట్టూ ఉంటే అంతకంటే కావాల్సింది ఇంకేముంటుంది?’ అన్నాడు అర్జున్‌.
Arjun kapoor
Malaika Arora
Marriage
Gossips

More Telugu News