Kurnool District: టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు.. 10 మందికి గాయాలు

  • బీసీ కాలనీ రహదారి విషయంలో గొడవ
  • ఆసుపత్రికి క్షతగాత్రుల తరలింపు
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు పూర్తయి, అంతా ప్రశాంతంగా ఉందని భావిస్తున్న తరుణంలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య పరస్పర దాడులు సంచలనం రేపాయి. కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు మండలం, మాస్‌మాన్‌దొడ్డిలో టీడీపీ, వైసీపీల పరస్పర దాడులతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీసీ కాలనీ రహదారి విషయంలో తలెత్తిన గొడవ దాడులకు దారి తీసింది. ఈ దాడుల్లో టీడీపీ కార్యకర్తలు 10 మంది గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
Kurnool District
Emmiganoor
BC Colony
Telugudesam
YSRCP

More Telugu News