BJP: తెలంగాణ బీజేపీ నేత కిషన్‌రెడ్డికి మాతృవియోగం

  • అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆండాలమ్మ
  • అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • నేడు తిమ్మాపూర్‌లో అంత్యక్రియలు
తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి  కిషన్‌రెడ్డి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి గంగాపురం ఆండాలమ్మ (80) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె బుధవారం అర్ధ రాత్రి దాటిన తర్వాత తుదిశ్వాస విడిచారు.  రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్‌లో నేటి మధ్యాహ్నం 3 గంటలకు ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆండాలమ్మ మృతికి పలువురు బీజేపీ నేతలు సంతాపం తెలిపారు.
BJP
Kishan reddy
Telangana
Hyderabad
Mother

More Telugu News