Andhra Pradesh: ఏపీలో జరిగిన పోలింగ్ ఏకపక్షమే.. టీడీపీ అధికారంలోకి రాబోతోంది!: మంత్రి అయ్యన్నపాత్రుడు

  • రాష్ట్రాన్ని దోపిడీదారుల చేతుల్లో పెట్టవద్దని కోరుకున్నా
  • మహిళలు అంతా టీడీపీ వెంటే ఉన్నారు
  • తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీడీపీ నేత
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోలింగ్ ఏకపక్షంగా జరిగిందని టీడీపీ నేత, ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఏపీలో టీడీపీ భారీ మెజారిటీతో మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు ఉదయం అయ్యన్నపాత్రుడు తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని దోపిడీదారుల చేతుల్లో పెట్టవద్దని శ్రీవేంకటేశ్వర స్వామిని కోరుకున్నట్లు తెలిపారు. అలాగే ముఖ్యమంత్రిగా మళ్లీ చంద్రబాబే రావాలని స్వామివారిని ప్రార్థించినట్లు చెప్పారు. ఏపీలో మహిళలు అంతా టీడీపీ వెంటే ఉన్నారని వ్యాఖ్యానించారు. ఎంత ఎండ ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజలు ఓపిగ్గా క్యూలైన్లలో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారని కితాబిచ్చారు.
Andhra Pradesh
Telugudesam
Ayyanna Patrudu
Tirumala

More Telugu News