Bhopal: తమ అభ్యర్థికి నల్ల జెండాలు చూపించారంటూ ఎన్సీపీ కార్యకర్తలపై బీజేపీ కార్యకర్తల దాడి

  • భోపాల్ బరిలో ప్రజ్ఞా సింగ్ ఠాకూర్
  • ఎన్నికల ప్రచారంలో దాడి ఘటన
  • పరిస్థితిని అదుపు చేసిన పోలీసులు
భోపాల్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై బీజేపీ కార్యకర్తలు దాడి జరిపారు. భోపాల్ బరిలో బీజేపీ లోక్‌సభ బరిలో దిగిన ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌కు నిరసనగా నల్ల జెండాలు చూపించారంటూ బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు దాడికి దిగారు. వెంటనే పోలీసులు కలుగజేసుకుని పరిస్థితిని అదుపు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే తమపై ఎన్సీపీ కార్యకర్తలే దాడి జరిపారని ప్రజ్ఞా మద్దతుదారులు పేర్కొన్నారు. దీంతో పోలీసులు ఎన్సీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు.
Bhopal
Pragya singh takur
NCP
BJP
Police
Social Media

More Telugu News