Chandrababu: విజయవాడ పున్నమి ఘాట్ లో ఐఏఎస్ ల సమావేశం... ఎల్వీ సుబ్రహ్మణ్యం పట్ల చంద్రబాబు వ్యాఖ్యలపై చర్చ!

  • పున్నమిఘాట్ చేరుకున్న ఐఏఎస్ లు
  • హరిత హోటల్ వేదికగా చర్చ
  • హాజరైన సీనియర్లు
రాజకీయాల ప్రభావం ఐఏఎస్ అధికారులపై గణనీయస్థాయిలో పడుతోందంటూ సర్వత్రా వినిపిస్తోన్న తరుణంలో పలువురు ఐఏఎస్ అధికారులు సమావేశం కావడం చర్చనీయాంశం అయింది. విజయవాడలోని పున్నమిఘాట్ లో ఉన్న హరిత హోటల్లో ఐఏఎస్ అధికారులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. జవహర్ రెడ్డి, జేఎస్వీ ప్రసాద్, ప్రవీణ్ కుమార్, ప్రసన్న వెంకటేశ్ తదితరులు ఈ సమావేశానికి విచ్చేశారు.

ఇటీవల కాలంలో ఐఏఎస్ అధికారులపై రాజకీయనేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుండడం గురించి ఈ సమావేశంలో ఐఏఎస్ లు ప్రధానంగా చర్చించనున్నారు.  ముఖ్యంగా, ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యల మీద కూడా చర్చించాలని నిర్ణయించుకున్నారు. ఈ సమావేశంలోనే ఐఏఎస్ ల సంఘం నూతన అధ్యక్షుడ్ని ఎన్నుకోనున్నారు.
Chandrababu
Andhra Pradesh
Vijayawada

More Telugu News