పేలుడు పదార్థాలతో కొలంబో దిశగా బయల్దేరిన కంటెయినర్.. శ్రీలంకలో హైఅలర్ట్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పేలుడు పదార్థాలతో కొలంబో దిశగా బయల్దేరిన కంటెయినర్.. శ్రీలంకలో హైఅలర్ట్!

  • కంటెయినర్ కోసం పోలీసుల గాలింపు
  • మరోసారి వరుస పేలుళ్లు జరగొచ్చని నిఘా సమాచారం
  • ప్రజల్లో తీవ్ర భయాందోళనలు
శ్రీలంకలో మరోసారి భయాందోళనలు తీవ్రస్థాయికి చేరాయి. పేలుడు పదార్థాలతో కూడిన ఓ కంటెయినర్ వాహనం కొలంబో దిశగా వచ్చిందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించడంతో పోలీసులు రంగంలోకి దిగి గాలింపు ముమ్మరం చేశారు. మరోసారి వరుస పేలుళ్లు జరిగే అవకాశముందని నిఘా వర్గాలు చెబుతుండడంతో ప్రజలు వణికిపోతున్నారు. ప్రస్తుతం కొలంబోలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో హై అలర్ట్ ప్రకటించారు.

ఆ కంటెయినర్ లో భారీస్థాయిలో పేలుడు పదార్థాలు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఈస్టర్ పండుగ సందర్భంగా జరిగిన దాడులకు ఐసిస్ తమదే బాధ్యత అని ప్రకటించుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, దేశంలోని అన్ని విమానాశ్రయాలు, ప్రముఖ పర్యాటక ప్రదేశాలు, హోటళ్ల వద్ద భద్రత మరింత పెంచారు.
Sri Lanka

More Telugu News