Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కలర్ తక్కువగా వున్నానని 'లవకుశ'లో వేషం ఇవ్వలేదు: 'డబ్బింగ్' జానకి

  • 'లవకుశ'లో ఒక పాత్ర కోసం పిలిపించారు 
  •  ఆ పాత్ర జయంతిగారికి దక్కింది
  • 'లవకుశ'లో చేయనందుకు ఇప్పటికీ బాధపడుతూ వుంటాను
ఒకప్పుడు నాటకాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న జానకి, ఆ తరువాత 'డబ్బింగ్' జానకిగా అనేక సినిమాల్లో నటించి మెప్పించారు. ఇక తెలుగు .. తమిళ ధారావాహికల ద్వారా కూడా ప్రేక్షకులకు ఆమె మరింత చేరువయ్యారు. అలాంటి 'డబ్బింగ్' జానకి తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ, ఒక ఆసక్తికరమైన విషయం చెప్పుకొచ్చారు.

"అప్పట్లో చిన్న వేషానికి కూడా .. అంటే చెలికత్తె వేషానికి కూడా టెస్ట్ కట్ లు చేసేవారు. ఎన్టీఆర్ 'లవకుశ' కోసం కబురు చేస్తే ఆఫీసుకి వెళ్లాను. అప్పుడు మేనేజర్ గా పేకేటి శివరామ్ గారు వున్నారు. ఫలానా పాత్ర కోసమని చెప్పి నన్ను దర్శకుడు సి. పుల్లయ్యగారికి చూపించారు. ఆ తరువాత అక్కడి నుంచి నేను వచ్చేశాను. నేను కాస్త కలర్ తక్కువగా వున్నానని చెప్పేసి, ఆ పాత్రకి జయంతిగారిని తీసుకున్నారనే విషయం తరువాత తెలిసింది. 'లవ కుశ' టీవీలో చూస్తున్నప్పుడల్లా .. అంత గొప్ప సినిమాలో వేషం పోయినందుకు బాధపడుతూ వుంటాను" అని చెప్పుకొచ్చారు. 
dubbing janaki

More Telugu News