BJP: బీజేపీలో చేరిన ప్రముఖ కేశాలంకరణ నిపుణుడు జావెద్‌ హబీబ్‌

  • మీడియా ముందు సంతోషం వ్యక్తం చేసిన జావెద్‌
  • ఇప్పటి వరకు కేశాలకే కాపలాదారుడిని...
  • ఇప్పుడు దేశానికి కాపలాదారుడిని అవుతానని వెల్లడి
ఇప్పటి వరకు కేశాలకు కాపలాదారుగా ఉన్న తనకు దేశానికి కాపలాదారుగా ఉండేలా పదోన్నతి లభించిందని ప్రముఖ కేశాలంకరణ నిపుణుడు జావెద్‌ హబీబ్‌ అన్నారు. నిన్న ఆయన ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీలో చేరడం చాలా సంతోషాన్నిస్తోందన్నారు.

తానో ఛాయ్‌వాలా అని ప్రధాని మోదీ చెప్పుకుంటారని, ఆయన ఆధ్వర్యంలో దేశంలో ఎన్నో సంస్కరణలు జరిగి మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని తాను బార్బర్‌ నని చెప్పుకునేందుకు ఏమాత్రం సిగ్గుపడనన్నారు. కాగా, కేశాలంకరణ నిపుణుడిగా హబీబ్‌కు ప్రపంచ వ్యాప్తంగా పేరుంది. పలువురు సెలబ్రిటీలకు ఆయన హెయిర్‌ స్టైలిస్ట్ గా వ్యవహరిస్తున్నారు. దేశవ్యాప్తంగా హబీబ్‌ పేరున దాదాపు 500 వరకు గొలుసుకట్టు సెలూన్లు నడుస్తున్నాయి. అంతటి ప్రముఖుడైన హబీబ్‌ ఎన్నికల ముందు బీజేపీలో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది.
BJP
javed habib
New Delhi

More Telugu News