union minister: వీడియో బయటపెడతానంటూ కేంద్ర మంత్రిని బ్లాక్ మెయిల్ చేసిన మహిళ అరెస్ట్

  • కేంద్ర మంత్రి మహేశ్ శర్మను బ్లాక్ మెయిల్ చేసిన మహిళ
  • రూ. 2 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్
  • గత కొన్ని రోజులుగా పలుకుబడి ఉన్న వ్యక్తులను టార్గెట్ చేస్తున్న ముఠా
రూ. 2 కోట్లు ఇవ్వకపోతే అభ్యంతరకరంగా ఉన్న వీడియోను బయటపెడతానంటూ కేంద్ర మంత్రి మహేశ్ శర్మను బ్లాక్ మెయిల్ చేసిన ఓ మహిళను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా గౌతమ్ బుద్ధ నగర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వైభవ్ కృష్ణ మాట్లాడుతూ, మహేష్ శర్మ నుంచి తమకు ఫోన్ వచ్చిందని... డిమాండ్ చేసిన మొత్తాన్ని ఇవ్వకపోతే వీడియోను బయటపెడతానని సదరు మహిళ హెచ్చరించిందని ఆయన చెప్పారని తెలిపారు. కేసును దర్యాప్తు చేసి సదరు మహిళను అరెస్ట్ చేశామని... అయితే ఆమె వద్ద ఎలాంటి అభ్యంతరకర వీడియో లేదని చెప్పారు.

సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులను టార్గెట్ చేసే ముఠా పని ఇదని వైభవ్ తెలిపారు. అయితే, ఒక వీడియో లభ్యమైందని... ఒక అమ్మాయితో మహేశ్ శర్మ మాట్లాడుతున్నట్టుగా మాత్రమే వీడియోలో ఉందని, అంతకు మించి అందులో వివాదాస్పదమైన సన్నివేశాలు లేవని చెప్పారు. గత కొన్ని రోజులుగా ఈ రాకెట్ సభ్యులు ఇదే పనిలో ఉన్నారని... గ్యాంగ్ లోని ఇతర సభ్యులను కూడా గుర్తించామని, ఎఫ్ఐఆర్ నమోదు చేశామని తెలిపారు.
union minister
mahesh sharma
black mail

More Telugu News