'జెర్సీ' విషయంలో నాని తీసుకున్న నిర్ణయం గొప్పది: దిల్ రాజు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'జెర్సీ' విషయంలో నాని తీసుకున్న నిర్ణయం గొప్పది: దిల్ రాజు

  • గౌతమ్ తిన్ననూరి అద్భుతంగా తెరకెక్కించాడు
  • కథలోని ఎమోషన్స్ కదిలించేస్తున్నాయి
  •  నానిలా ఆలోచిస్తే మంచి సినిమాలు వస్తాయి
నాని కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన 'జెర్సీ' .. ఈ నెల 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజునే ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు, ఓవర్సీస్ లోను ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన అభినందన సభను ఏర్పాటు చేశారు.

ఈ వేదికపై దిల్ రాజు మాట్లాడుతూ .. "దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. పెద్దగా అనుభవం లేకపోయినా, ఆయా పాత్రలచే ఆయన ఆవిష్కరింపజేసిన ఎమోషన్స్  ప్రేక్షకుల మనసులను పట్టేశాయి. నాని పారితోషికం గురించి మాట్లాడకుండా .. సినిమా బాగా ఆడితే షేర్ ఇస్తే చాలని చెప్పేసి రంగంలోకి దిగాడు. హీరోలు ఇలా డబ్బును దాటి ముందుకు వస్తేనే ఇలాంటి మంచి సినిమాలు వస్తాయి. ఈ సినిమా విషయంలో ఈ తరహా నిర్ణయం తీసుకున్నందుకు నానీని అభినందిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చారు. 
nani
dil raju

More Telugu News