శ్రీలంకలో ప్రాణాలతో బయటపడ్డ 18 మంది ఏపీ భక్తులు
- పుణ్యక్షేత్రాలను దర్శించేందుకు ఏలూరు నుంచి వెళ్లిన భక్తులు
- పేలుళ్లు జరగడానికి ముందు రోజు కొలంబోలో బస
- జాఫ్నాకు వెళ్లడంతో ప్రాణాలతో బయటపడ్డ వైనం
భక్త బృందంలోని మురళీకృష్ణ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ, బాంబు పేలుళ్లు జరగడానికి ముందు రోజున తామంతా కొలంబోలోని హోటల్ లో ఉన్నామని చెప్పారు. భగవంతుని దయవల్ల శనివారం రాత్రి అక్కడి నుంచి జాఫ్నాకు బయల్దేరామని, ప్రాణాలతో బయటపడ్డామని తెలిపారు. మరోవైపు, ఏపీలోని వివిధ ప్రాంతాలకు చెందిన మరో 15 మంది భక్తులు కూడా శ్రీలంకలో ఉన్నట్టు సమాచారం.