చంద్రబాబు మోచేతి నీళ్లు తాగే లక్ష్మీనారాయణకు మా పార్టీలో స్థానం లేదు: విజయసాయిరెడ్డి
- కోవర్టు ఆపరేషన్ల కోసం వైసీపీలో చేరాలనుకుంటున్నారేమో
- సీఎస్ ను ఇరికించేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారు
- నాలుగు రోజుల్లో పోయేవారికి భయపడాల్సిన అవసరం లేదు
చంద్రబాబు మతి తప్పి మాట్లాడుతుంటే, కాంగ్రెస్ పార్టీ ఆయన వ్యాఖ్యలను బలపరుస్తోందని విజయసాయి విమర్శించారు. ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయంపాలైన తర్వాత మొత్తం ఎన్నికలను రద్దు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేసినా ఆశ్చర్యం లేదని అన్నారు. ఓటు వేసిన జనాలకు లేని అనుమానాలు చంద్రబాబుకు వస్తున్నాయని దుయ్యబట్టారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంను ఇరికించేందుకు బాబు అండ్ కంపెనీ ఒత్తిళ్లు మొదలు పెట్టిందని విజయసాయి ఆరోపించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా, మంత్రివర్గానికి జవాబుదారీగా ఉండాలని సీఎస్ ను బెదిరిస్తున్నారని అన్నారు. నాలుగు రోజుల్లో పెట్టేబేడా సర్దుకునేవారికి భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు.