Budha Venkanna: ఆర్థిక నేరస్థుడైన జగన్ దగ్గర విజయసాయి, సి.రామచంద్రయ్య శకుని వంటి వారు: బుద్ధా వెంకన్న

  • జగన్ ఎన్నికల్లో రూ.8 వేల కోట్లు ఖర్చు చేశారు
  • రామచంద్రయ్యను వైసీపీ కార్యకర్తలు కూడా గుర్తించట్లేదు
  • చంద్రబాబుపై బురద జల్లితే ఆకాశంపై ఉమ్మి వేసినట్టే
ఆర్థిక నేరస్థుడైన వైసీపీ అధ్యక్షుడు జగన్ దగ్గర ఆ పార్టీ నేతలు విజయసాయిరెడ్డి, సి. రామచంద్రయ్య శకుని వంటి వారని టీడీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల జరిగిన ఎన్నికల్లో జగన్ సుమారు రూ.8 వేల కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు.

నిత్యం పార్టీలు మారుతూ ఏ రోజు ఏ పార్టీలో ఉంటారో తెలియని రామచంద్రయ్యను వైసీపీ కార్యకర్తలు కూడా గుర్తు పట్టడం లేదని వెంకన్న వ్యంగ్యంగా అన్నారు. నిజాయతీలేని అలాంటి వ్యక్తుల కారణంగానే ప్రజలు రాజకీయాలను అసహ్యించుకునే పరిస్థితి వచ్చిందన్నారు. సీఎం చంద్రబాబుపై బురద జల్లితే ఆకాశంపై ఉమ్మి వేసినట్టేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Budha Venkanna
Chandrababu
Jagan
Vijayasai Reddy
C.Ramachandraiah

More Telugu News