Rahul Gandhi: రాహుల్ నామినేషన్ చెల్లుబాటవుతుంది: అమేథీ రిటర్నింగ్ అధికారి

  • పేరు, పౌరసత్వం, విద్యార్హతపై అనుమానాలు
  • ఇండిపెండెంట్ అభ్యర్థి ధ్రువ్‌లాల్ ఫిర్యాదు
  • నేడు పరిశీలించి ఓకే చెప్పిన అధికారి  
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల నామినేషన్ పై నెలకొన్న సందిగ్ధం తొలగింది. ఆయన నామినేషన్‌ చెల్లుబాటవుతుందని అమేథి రిటర్నింగ్ అధికారి స్పష్టం చేశారు. రాహుల్ నామినేషన్‌లో పేరు, పౌరసత్వం, విద్యార్హతపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఇండిపెండెంట్ అభ్యర్థి ధ్రువ్‌లాల్ ఫిర్యాదు చేశారు.

 ఈ విషయమై స్పష్టత వచ్చే వరకూ రాహుల్ నామినేషన్‌ను స్వీకరించవద్దని ధ్రువ్ తరపు న్యాయవాది రిటర్నింగ్ అధికారిని కోరారు. దీంతో రిటర్నింగ్ అధికారి రాహుల్ నామినేషన్ పరిశీలనను ఈ రోజుకి వాయిదా వేశారు. నేడు అన్ని అంశాలను పరిశీలించిన ఎన్నికల సంఘం రాహుల్ నామినేషన్‌ను స్వీకరిస్తున్నట్టు స్పష్టం చేసింది.
Rahul Gandhi
Dhruv Lal
EC
Amethi
Returning Officer
Congress

More Telugu News