Vijay Devarakonda: విజయ్ దేవరకొండ సైడ్ అయిపోయి.. సూర్యకు దారిచ్చాడట!

  • సూర్య విషయంలో వెనక్కి తగ్గిన విజయ్
  • విజయ్, రష్మిక జంటగా ‘డియర్ కామ్రేడ్’
  • మే 31న విడుదల కావాల్సి ఉంది
  • ‘ఎన్జీకే’ కారణంగా జూన్ 19న విడుదల
ప్రస్తుతం టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండకు మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమాలకు మంచి ఓపెనింగ్స్ కూడా వుంటాయి. అలాంటి విజయ్ ఇప్పుడు తమిళ్ హీరో సూర్య విషయంలో మాత్రం వెనక్కి తగ్గాడు. భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్, రష్మిక జంటగా నటించిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ఈ చిత్రం నిజానికి మే 31న విడుదల కావాల్సి ఉంది.

అయితే అదే రోజు సూర్య నటించిన ‘ఎన్జీకే’ చిత్రం విడుదల కానుంది. దీంతో ‘డియర్ కామ్రేడ్’ను వాయిదా వేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఒక్క కోలీవుడ్‌లోనే కాకుండా మొత్తం దక్షిణాదిలో సూర్యకు మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో విజయ్ సినిమా విడుదలను చిత్రబృందం రెండు వారాల పాటు వాయిదా వేయాలని నిర్ణయించిందట. అంటే ఈ చిత్రం జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.
Vijay Devarakonda
Surya
Rashmika
Bharath Kamma
Dear Comrade
NGK

More Telugu News