Telugudesam: మోదీ దిగిపోతే విజయసాయికి చిప్పకూడే!: బుద్ధా

షార్ట్స్‌లో చూడండి
వైసీపీ అగ్రనేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పటికే బీజేపీ నేత జీవీఎల్ పై చెప్పులు పడ్డాయని, మే 23 తర్వాత విజయసాయికి కూడా చెప్పు దెబ్బలు తప్పవని ఎద్దేవా చేశారు. జీవీఎల్ మైక్ లో, విజయసాయి ట్విట్టర్ లో ఇష్టంవచ్చినట్టు మొరుగుతున్నారని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల తర్వాత పదవి నుంచి దిగిపోవడం ఖాయమని, ఆయన దిగిపోతే విజయసాయికి చిప్పకూడు తప్పదని వ్యాఖ్యానించారు. జీవితాంతం ఆయన జైల్లోనే గడపాల్సి ఉంటుందని అన్నారు. జీవీఎల్ కు సైతం కష్టాలు తప్పవని, మోదీ దిగిపోయిన తర్వాత జీవీఎల్ చేతిసంచీతో మళ్లీ దేశయాత్ర చేయాల్సి ఉంటుందని వ్యంగ్యం ప్రదర్శించారు.
Go Back to Shorts
Telugudesam
Vijay Sai Reddy

More Telugu News