తెలంగాణలో కాంగ్రెస్ గల్లంతు.. స్పీకర్ కు విలీనం లేఖ ఇవ్వనున్న 13 మంది రెబెల్ ఎమ్మెల్యేలు!

  • ఇప్పటికే టీఆర్ఎస్ లోకి 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
  • మరో ముగ్గురు జంప్ అయ్యేందుకు సిద్ధం
  • అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోల్పోనున్న కాంగ్రెస్
తెలంగాణలో అధికార టీఆర్ఎస్  పార్టీలో కాంగ్రెస్ సీఎల్పీ విలీనానికి సర్వం సిద్ధమయింది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలవగా, వీరిలో 10 మంది ఇప్పటికే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా మరో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు.

దీనివల్ల అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ  ప్రస్తుతమున్న ప్రతిపక్ష హోదాను కోల్పోనుంది. ఈ నేపథ్యంలో 13 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన విలీనం లేఖను స్పీకర్‌కు అందజేసేందుకు టీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తోందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. జూన్ మొదటివారంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఆలోపే ఈ ప్రక్రియను పూర్తిచేయాలని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం.
Go Back to Shorts
Telangana
TRS
Congress
merge
13 rebel mlas

More Telugu News