ఏపీ అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాం.. మమ్మల్ని ఇబ్బంది పెట్టడం సరికాదు!: ఐకాస చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు
- ఎంత ఒత్తిడి ఎదురైనా తట్టుకున్నాం
- కనీస సౌకర్యాలు లేకపోయినా తెల్లవారేదాకా విధుల్లో పాల్గొన్నాం
- అమరావతిలో మీడియాతో ఐకాస నేత
ఈసీ ఇటీవల ఎన్నికల విధుల్లో పాల్గొన్న ముగ్గురు ఎమ్మార్వోలను సస్పెండ్ చేసిందనీ, ఈ వ్యవహారంపై ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదిని కలిశామని తెలిపారు. కేవలం వీవీప్యాట్ స్లిప్పులు బయటపడ్డాయన్న కారణంతో కేసు పెట్టడాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.
రాజకీయ నేతలు తమ ప్రయోజనాల కోసం ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఎన్నికల విధుల్లో కేవలం ఎమ్మార్వోలే కాకుండా ఇతర ఉద్యోగులు కూడా పాల్గొనేలా చూడాలని కోరినట్లు పేర్కొన్నారు. ఎన్నికల విధులకు హాజరైన వారికి బడ్జెట్ విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు.