మోదీని పశ్చిమ బెంగాల్ నుంచి బరిలోకి దిగమంటున్న రాష్ట్ర నేతలు
- వారణాసి నుంచి పోటీ చేస్తున్న మోదీ
- మమతను ఢీకొట్టేందుకు పశ్చిమ బెంగాల్ నుంచి కూడా బరిలోకి దింపే యత్నం
- మోదీ సుముఖంగా ఉన్నారంటున్న నేతలు
పశ్చిమబెంగాల్‌లోని 42 లోక్‌సభ స్థానాలకు ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 12, 19న చివరి రెండు విడతల పోలింగ్ జరగనుంది. దక్షిణ దీనాజ్‌పూర్‌లోని బునియాద్‌పూర్‌లో మోదీని కలిసిన రాయ్ తన కోరికను ఆయన ముందు ఉంచారు. రాష్ట్రంలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ద్వారా రాష్ట్రంలో బీజేపీని మరింత బలోపేతం చేయవచ్చని ఆయనకు వివరించారు.