అత్యవసర సేవలకు ఇక దేశం మొత్తం ఒకటే నంబరు-112.. ఏపీ, తెలంగాణలోనూ అందుబాటులోకి!
- సాయం ఏదైనా ఇక ఒకటే నంబరు
- మొత్తం 20 రాష్ట్రాల్లో అందుబాటులోకి
- ఈఆర్సీ ద్వారా సత్వర సేవలు
ఈ నంబరు అందుబాటులోకి వచ్చిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ, పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు, దాద్రానగర్ హవేలి, డామన్ డయ్యు, జమ్ముకశ్మీర్, నాగాలాండ్ ఉన్నాయి. సాయాన్ని అర్థించే వ్యక్తులు 112 నంబరుకు ఫోన్ చేస్తే అది వారికి దగ్గరలోని నెట్వర్క్ టవర్ ఆధారంగా ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ (ఈఆర్సీ)కి అనుసంధానం అవుతుంది. దీంతో సంబంధిత అధికారులు సత్వరం స్పందించి సాయం అందిస్తారు.