kolkata knight riders: కోల్‌కతాపై చెలరేగిన కోహ్లీ.. మూడేళ్ల తర్వాత ఐపీఎల్‌లో సెంచరీ

ఐపీఎల్‌లో కోహ్లీ సేన మరో విజయాన్ని అందుకుంది. శుక్రవారం కోల్‌కతాలోని నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో పది పరుగుల తేడాతో విజయం సాధించి రెండో విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన బెంగళూరుకు ఇది రెండో విజయం.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 213 పరుగులు చేసింది. కెప్టెన్ కోహ్లీ అద్భుత ఆటతీరుతో మరోమారు ఆకట్టుకున్నాడు. 58 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో సరిగ్గా వంద పరుగులు చేసి ఐపీఎల్‌లో ఐదో సెంచరీ నమోదు చేశాడు. ఫలితంగా ఈ జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. పంజాబ్ ఓపెనర్ క్రిస్‌గేల్ ఆరు సెంచరీలతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మెయిన్ అలీ 28 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 66 పరుగులు చేశాడు.  

అనంతరం 214 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా 203 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. నితీశ్ రాణా 46 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 85 పరుగులు, ఆండ్రూ రస్సెల్ 25 బంతుల్లో 2 ఫోర్లు, 9 సిక్సర్లతో 65 పరుగులు చేసినప్పటికీ జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. విరాట్ కోహ్లీకి  ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
kolkata knight riders
bangalore royal challengers
IPL
Virat Kohli

More Telugu News